పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు దిగారు.
పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు దిగారు. పక్కరాష్ట్రం తెలంగాణలో గిరిజన ఆశ్రమ పాఠశాలల టీచర్లకు రూ.15వేలకు వేతనం పెంచినా ఇక్కడి ప్రభుత్వంలో కదలిక లేదని విమర్శించారు. మూడేళ్లుగా తాము రూ.5వేల వేతనంతోనే పనిచేస్తున్నామని చెప్పారు. మెరుపు సమ్మెలో 480 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.