ఎల్ తండాలో కాంటాక్ట్ వ్యక్తి నుంచి స్వాబ్ సేకరిస్తున్న చిన్నమల్కాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి విజయభాస్కర్
సాక్షి, కర్నూలు: వెల్దుర్తి మండలంలోని ఎల్ నగరం తండాలో కరోనా పాజిటివ్ కేసు కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన యువతికి పత్తికొండ మండలం మర్రిమాను తండాకు చెందిన యువకుడితో ఈ నెల 10న మర్రిమాను తండాలో వివాహం జరిగింది. అదే రోజు సాయంత్రం పెళ్లి కుమార్తె స్వగ్రామం ఎల్ తండాలో మరలా పెళ్లి జరిగింది. పెళ్లి కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ నెల 8న కరోనా పరీక్ష నిమిత్తం స్వాబ్ శాంపిల్స్ సేకరించారు.
పెళ్లి అయిన తరువాతి రోజు అంటే ఈ నెల 11న నివేదిక వచ్చింది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో అటు పత్తికొండ, ఇటు వెల్దుర్తి మండలాల్లో కలకలం రేగింది. వెల్దుర్తి మండల అధికారులు తక్షణం స్పందించి ఎల్ తండాలో 70 గృహాలుండగా అందరికీ హోం క్వారంటైన్ నోటీసులిచ్చారు. రాకపోకలు బంద్ చేయించారు. పెళ్లి వేడుకలకు హాజరైన వ్యక్తుల వివరాలను సేకరించడమే కాకుండా.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. చదవండి: తినేవస్తువు అనుకుని.. నాటుబాంబుని కొరికి
Comments
Please login to add a commentAdd a comment