కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ వ్యాధితో ఆదివారం కర్నూలు మేదరి వీధికి చెందిన వ్యక్తి స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం జిల్లాలో మరో 26 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 156కు చేరింది. తాజాగా పాజిటివ్ వచ్చిన వారిలో నంద్యాల పట్టణానికి చెందిన ఐదుగురు, నంద్యాల రూరల్ ఒకరు, చాగలమర్రి ఒకరు, తుగ్గలి మండలం ఆర్.కొట్టాల ఒకరు, శిరివెళ్ల ఒకరు, కర్నూలు రూరల్‌లో ఒకరితో పాటు కర్నూలు నగరానికి చెందిన 16 మంది ఉన్నారు. పాజిటివ్ నుంచి కొలుకొని ఓ యువకుడు డిశ్చార్జ్ అయ్యాడు.
కాగా.. ఇప్పటివరకు కర్నూలు నగరంలో మొత్తం కేసులు 80కి చేరాయి. అలాగే నంద్యాల మున్సిపాలిటీలో 25, ఆత్మకూరు ఐదు, నందికొట్కూరు మూడు, డోన్ ఒకటి, బేతంచర్ల మున్సిపాలిటీలో ఒకటి, నంద్యాల మండలంలో 8, పాణ్యం 7, బనగానపల్లె 5, చాగలమర్రి నాలుగు, కోడుమూరు మూడు, గడివేముల రెండు, శిరివెళ్ల మూడు, కర్నూలు రెండు, ఓర్వకల్లు ఒకటి, నందికొట్కూరు ఒకటి, అవుకు ఒకటి, రుద్రవరం ఒకటి, సంజామల ఒకటి, తుగ్గలి మండలంలో ఒకటి చొప్పున నమోదయ్యాయి. అలాగే జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణలోని గద్వాలకు చెందిన ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
జిల్లా వ్యాప్తంగా అప్రమత్తం అయిన అధికారులు.. 27 మండలాలు, 10 మున్సిపాలిటీలను రెడ్ జోన్లుగా ఏర్పాటు చేశారు. రాకపోకలను నిలిపి వేసి అత్యవసర సేవలు డోర్ డెలివరీలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఉదయం 9 నుంచి బయటకు వచ్చే వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలు సిజ్ చేస్తున్నారు. మాస్కులను తరించి సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శానిటేషన్, పాజిటివ్ కేసులు నమోదు కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 3537 నమూనాలకు 1927 నమూనాలకు ఫలితాలు వచ్చాయి. ఇంకా 1610 శాంపిల్స్ లకు ఫలితాలు రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment