
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా.. వలస కార్మికులు, కరోనా వైరస్ సోకిన వారి సంబందీకులు, స్నేహితుల వల్ల అక్కడక్కడ మళ్లీ వైరస్ జాడలు కనిపిస్తున్నాయి.
తాజాగా శుక్రవారం ఉదయం నమోదైన కేసుల్లో విజయవాడ నగరంలోని కృష్ణలంకలో 5, పంజాసెంటర్‌లో 4 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా కేసుల సంఖ్య 360కి చేరింది. ఇప్పటి వరకు 216 మంది కరోనా వైరస్‌ను జయించగా.. 130 మంది విజయవాడ, చిన్నఅవుట్‌పల్లి కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment