వైఎస్సార్‌సీపీ ఎంపీల విరాళం | Coronavirus: YSRCP MPs to donate salary to relief funds | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీల విరాళం

Published Thu, Mar 26 2020 4:36 AM | Last Updated on Thu, Mar 26 2020 4:36 AM

Coronavirus: YSRCP MPs to donate salary to relief funds - Sakshi

సాక్షి,అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తమ వంతు సాయం అందించడానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు ముందుకొచ్చారు. అందులో భాగంగా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఒక నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి  విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.  ఈ నేపథ్యంలో పేద ప్రజలకు అండగా ఉండేందుకే ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళం ఇస్తున్నట్లు చెప్పారు.

- ఎంపీ బాలశౌరి సీఎం సహాయనిధికి ఎంపీ లాడ్స్‌ నుంచి రూ.4 కోట్లు ఇచ్చారు.
- అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌ నాథ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తన మూడు నెలల జీతం విరాళంగా ప్రకటించారు.
- ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. వ్యక్తిగతంగా ఈ విరాళం ఇస్తున్నానని చెప్పారు. సంక్షోభ నివారణలో ప్రజలంతా కూడా భాగస్వాములు కావాలన్నారు.  
- విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ముఖ్యమంత్రి సహాయ నిధికి తన రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.
- రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కరోనా వైరస్‌ నిర్మూలనకు తన వంతుగా నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. మేరకు బుధవారం కలెక్టర్‌ జె.నివాస్‌కి కలెక్టర్‌ కార్యాలయంలో లక్ష రూపాయల నగదు అందజేశారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం: గడికోట 
కోవిడ్‌–19 నివారణ చర్యలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నామని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుత సమయంలో మానవతా దృక్పథంతో తమ వంతుగా ఈ సహాయం చేస్తున్నామని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement