నాటు బాంబు తిని ఏనుగు మృతి | country bomb claims elephant life in chittoor district | Sakshi
Sakshi News home page

నాటు బాంబు తిని ఏనుగు మృతి

Published Tue, Jul 7 2015 5:23 PM | Last Updated on Thu, Jul 11 2019 6:30 PM

నాటు బాంబు తిని ఏనుగు మృతి - Sakshi

నాటు బాంబు తిని ఏనుగు మృతి

ఎర్రావారిపాళెం: చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలం పులుబోనువారిపల్లెలో సోమవారం నాటు బాంబు తిని ఏనుగు మృతి చెందింది. మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. రాత్రి సమయాల్లో అటవీ సరిహద్దు గ్రామాల్లోని పంట పొలాలపై దాడులు చేస్తూ పగటిపూట శేషాచలం అడవుల్లో సేదదీరుతున్నాయి.

ఆదివారం రాత్రి మండలంలోని నెరబైలు పంచాయతీ పులుబోనువారిపల్లెకు సమీపంలోని ఓ మామిడితోటలోకి ఆరు సంవత్సరాల ఆడ ఏనుగు వచ్చింది. అక్కడున్న ఓ నాటుబాంబును ఆహారం అని భావించి తినడంతో నోటిబాగం పేలి మామిడి తోటలో మృతి చెందింది.

సోమవారం గుర్తించిన రైతులు అటవీశాఖాధికారులకు తెలిపారు. అటవీ అధికారులు వచ్చి ఏనుగు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకున్నారు. నాటుబాంబు అక్కడకు ఎలావచ్చిందనే విషయాన్ని ఆరాతీస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement