
ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయా..
విజయవాడ: నగరంలో బీసెంట్ రోడ్‌లో జరిగిన దోపిడీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు నిందితులను గుర్తించాం. వర్షం కారణంగా సీసీ కెమెరాలో నిందితుల ముఖాలు స్పష్టంగా కనపడటం లేదు.
దోపిడీకి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించాం. నిందితులను పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపామని ఆయన తెలిపారు. వీలైనంత త్వరలో వారిని పట్టుకుంటాం. కార్ఖానా గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని ఆయన అన్నారు. వైజాగ్, కర్నూల్ లో జరిగిన దోపిడీకి ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.