
సీపీఐ మహాసభలు ప్రారంభం
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో సీపీఐ 11వ జిల్లాల మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నేతల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ కాంప్లెక్స్‌నుంచి తాండ్ర పాపారాయుడు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి జేవీ సత్యాన్నారాయణమూర్తితో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.