వారిద్దరూ మోదీ చేతిలో బకరాలు
వెంకయ్య,బాబులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోదీ చేతిలో బకరాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. అధికారం ఉంది కదా అని అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో క లసి నారాయణ విలేకరులతో మాట్లాడారు. వెంకయ్య, చంద్రబాబు హోదా వల్ల ఏం ప్రయోజనం అని మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల్లో పర్యటించి అభివృద్ధి జరిగిందో లేదో చూద్దామా? అని నారాయణ సవాల్ విసిరారు.