అరకోటి విలువైన బాణాసంచా స్వాధీనం | Crackers worth Rs 50 lakh seized | Sakshi
Sakshi News home page

అరకోటి విలువైన బాణాసంచా స్వాధీనం

Published Tue, Nov 3 2015 6:41 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

Crackers worth Rs 50 lakh seized

కోటగుమ్మం (రాజమండ్రి) : రాజమండ్రి నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.50 లక్షల విలువైన బాణాసంచాను అధికారులు సీజ్ చేశారు. నగరంలోని మోచీ వీధిలో ఉన్న అరవ సుబ్బరాజు అనే వ్యాపారికి చెందిన ఏడు గోదాములపై మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులు సోదాలు చేశారు.

ఆ గోదాముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ.50 లక్షల విలువైన మందుగుండు సామగ్రిని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సోదాల్లో రాజమండ్రి అర్బన్ ఎస్పీ బి.శరత్ బాబుతోపాటు అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement