చరిత్ర సృష్టిద్దాం...! | Create history ...! | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టిద్దాం...!

Published Thu, Mar 6 2014 1:13 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Create history ...!

బొబ్బిలి, న్యూస్‌లైన్:మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధిక స్థానాల్లో గెలిపించి చరిత్ర సృష్టిద్దామని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయూలని సూచించారు.
 
 బుధవారం ఆయన స్థానిక దర్బార్ మహాల్‌లో పట్టణంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాజులపై వ్యతిరేక ప్ర చారం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ నేతల వ్యాఖ్యాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ కూలీలను పెట్టి మరీ పట్టణంలో రాజులకు బలం తగ్గిపోయిందని.. గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసిందన్నారు. ప్రస్తుతం మూడు నెలలుగా మళ్లీ అదే పని చేస్తోందన్నారు. ఈ ఎన్నికల ద్వారా వారందరికీ గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పారు.
 
 పార్టీ మారామన్న అక్కసుతో కాంగ్రెస్ నాయకులు పట్టణాభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. మన మెజార్టీతో ఎంపీ అయిన వ్యక్తి మనకు ఎంపీ నిధులతో కేవలం ట్యూబ్‌లైట్లు కోసమే నిధులు ఖర్చు పెట్టారని తెలిపారు. శంకుస్థాపనలకే బొబ్బిలి వస్తున్న ఎంపీ తరువాత వాటి అమలు గురించి పట్టించుకోవడం లేదన్నారు. రోడ్ల విస్తరణలో ప్రాధాన్యం ఉన్న రోడ్డును వదిలేసి, రాజకీయంగా వారికి ప్రాధాన్యత, నాలుగు కాసులు వచ్చే రోడ్డు విస్తరణకు నిధులు తెచ్చుకున్నారని మండిపడ్డారు. వీటన్నింటిపై ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయూలను కూ డా ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు.
 
 పార్టీ విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త బేబీనాయన మాట్లాడుతూ నాయకులు సమన్వయం తో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. టిక్కెట్ రాని వారు నిరాశ పడవద్దని, అందరికీ సమానమైన గౌరవాన్ని ఇస్తామన్నారు. టిక్కెట్లు ఆశించే వారు దరఖాస్తులు అందివ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు తూముల రాంసుధీర్,  సీనియర్ కౌన్సిలరు రావు నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement