ప్రజల పక్షాన పోరాటం
విజయనగరం మున్సిపాలిటీ : ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కే రంగారావు అన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ విధానాలపై అవలంభించాల్సిన వైఖరిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన కోలగట్ల నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ల ఏరివేత కోసం ప్రభుత్వం బోగస్ సర్వే చేయించిందన్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. అర్హులైన వారిని కావాలనే తొలగించారని చెప్పారు. దీనిపై ప్రజల పక్షాన పోరుబాట పడతామని హెచ్చరించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కలిసి పని చేయూలన్నారు. జిల్లా లో పార్టీ పరిస్థితులను తెలుసుకునేందుకు స్వయంగా పర్యటిస్తామన్నారు.
పార్టీకోసం పనిచేసేవారికి గ్రామ, మండల, జిల్లా స్థారుు కమిటీల్లో స్థానం కల్పిస్తామని చెప్పారు. విశాఖ జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా శ్రీకాకుళంలో జిల్లాలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. హామీల అమలుకు పోరాటం చేస్తామన్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కాలయూపనకే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. ఈ నెల 2నుంచి చేపట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పెంచిన పింఛన్లు ఇస్తామని ప్రకటించినా ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. బోగస్ పింఛన్ల ఏరివేత పేరుతో నిర్వహించి న సర్వే వల్ల అర్హులకు అన్యా యం జరిగిందన్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పా రు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జిల్లాలో కింది స్థాయి నుంచి జిల్లా స్థారుు వరకు పార్టీ బలోపేతానికి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
ఇందులో భాగంగా ఈ నెల 9 నుంచి మండలాల్లో పర్యటించనున్నట్టు తెలిపారు. 9న ఉదయం పది గంటలకు చీపురుపుల్లి మండలంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మెరకముడిదాం మండలంలో పర్యటించనున్నట్టు పేర్కొన్నారు. 10న ఉదయం బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో, సాయంత్రం 4 గంటలకు రామభద్రాపురం మండలంలో, 11న ఉదయం 10 గంటలకు ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో, సాయంత్రం 4 గంటలకు ఎల్.కోట మండలంలో, 12న ఉదయం నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలో, సాయంత్రం 4 గంటలకు డెంకాడ మండలంలో పర్యటించటం జరుగుతుందన్నా రు. 13న ఉదయం 10 గంటలకు గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలో, సాయంత్రం 4 గంటలకు గజపతినగరం మండలంలో, 14న ఉదయం విజయనగరం పట్టణంలో, సాయంత్రం మండల పరిధిలో, 18న ఉదయం 10 గంటల కు కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలో, సాయంత్రం 4 గంటలకు గరుగుబిల్లి మండలంలో, 19న ఉదయం 10 గంటలకు గుమ్మలక్ష్మీపురం మండలంలో, సాయంత్రం 4 గంటలకు కురుపాం మండలంలో పర్యటనలు ఉంటాయన్నా రు. 20న ఉదయం 10 గంటలకు పార్వతీపురం పట్టణంలో,
సాయంత్రం 4 గంటలకు పార్వతీపు రం మండలంలో, 21న ఉదయం సీతానగరం మం డలంలో, సాయంత్రం బలిజిపేట మండలంలో మండల పర్యటనలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో ఆయా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు, పార్టీ తరఫున పోటీ చేసిన నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొంటారని తెలిపారు. వారి సమక్షంలోనే మండ ల కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు. మరో నాలుగు రోజుల్లో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర పార్టీ ఆమోదం కోసం పంపించనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 16న ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అన్ని మండలాల తహశీల్లార్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు. తద్వారా జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వెన్నుదన్నుగా నిలుస్తామన్నారు.
సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ టీడీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తేలికగా విడిచిపెట్టమన్నారు. ప్రధానంగా పింఛన్ల సర్వేలో అర్హులకు అన్యాయం చేస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. సర్వే కమిటీల్లో టీడీపీ పార్టీ నాయకులను వేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. సమావేశంలో కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్ఫశ్రీవా ణి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయ న, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు కడుబండి శ్రీనివాసరావు, నెక్కల నాయుడుబాబు, జమ్మాన ప్రసన్నకుమార్, పెనుమత్స సురేష్‌బాబు, కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, మార్క్‌ఫెడ్ డెరైక్టర్ కేవీఎన్ సూర్యనారాయణరాజు, అంబళ్ల శ్రీరాములనాయుడు, చనుమళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.