హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెల్త్‌కార్డులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్షించారు. కొంత మంది ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సచివాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. హెల్త్‌కార్డుల జాప్యానికి కారణాలు, ప్రభుత్వాసుపత్రులకు ప్యాకేజీలు ఏ విధంగా ఉన్నాయి, నగదు రహిత వైద్యానికి అర్హులు ఎంత మంది ఉన్నారు తదితర వివరాలు అడిగారు.
విజయవాడలో ఏర్పాటు చేసే తాత్కాలిక కార్యాలయాలపైనా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబ్‌లు పాల్గొన్నారు.
ఉద్యోగుల హెల్త్‌కార్డులపై సీఎస్ సమీక్ష
Published Wed, Feb 11 2015 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement