
‘పెద్ద మాదిగ’ హామీని నిలబెట్టుకోవాలి
- దండు వీరయ్య మాదిగ డిమాండ్
ఒంగోలు సెంట్రల్ : ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్దమాదిగను అవుతానని చెప్పారన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు అనేక సార్లు ఢిల్లీ వెళ్లారని, అయినా ఎస్సీ వర్గీకరణపై చర్చించలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వర్గీకరణకు చట్టబద్ధత ఆలస్యం అవుతోందన్నారు. ఈ విషయంలో మాదిగ ప్రజా ప్రతినిధులు చంద్రబాబును నిలదీయాలన్నారు.
విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి లాం డానియేలు మాదిగ, చాట్ల డానియేలు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి తాతపూడి ప్రభుదాస్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జాకబ్ పాల్ మాదిగ, మంటి ఆశీర్వాదం మాదిగ, ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి జండ్రాజుపల్లి మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి సండ్రపాటి కాలే బు మాదిగ, పూనూరి నరేంద్ర మాదిగ పాల్గొన్నారు.