రాజంపేట: రైతుల రుణాలు మాఫీ చేస్తాంటున్న ప్రభుత్వం తాజాగా బ్యాంకులకు విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉద్యానవన రైతులకు రుణమాఫీ లేదని పేర్కొన్నట్లు తెలిసింది. ఓ వైపు బ్యాంకులు తమ శాఖ పరిధిలో రైతులు తీసుకున్న రుణాల ఆధారంగా జాబితా తయారు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం ఉద్యానవన రైతులకు రుణమాఫీ వర్తించదంటూ తే ల్చడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలో 83 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా రాజంపేట, ైరె ల్వేకోడూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గ ప్రాంతాల్లో 70 శాతం మంది రైతులు ఉద్యానవన పంటల సాగుకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ. ఎస్‌బీహెచ్, ఏపీజీబీ, ఆంధ్రా బ్యాంకుల నుంచి వేల సంఖ్యలో ఉద్యానవన రైతులు రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం రుణామాఫీ వీరికి వర్తించదని తేల్చేయడంతో ఆందోళన చెందుతున్నారు.
మహానేత హయాంలో మేలు..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు రుణమాఫీ జరిగిన సందర్భంలో అన్ని విధాలుగా మేలు జరిగిందని రైతులు ఇప్పటికి నెమరువేసుకుంటున్నారు. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేయనున్న రుణమాఫీ తీరు రైతులకు నష్టం చేకూర్చేలా ఉందని విమర్శిస్తున్నారు.
ఉద్యానవన రైతులపై చంద్రబాబు వివక్ష
రుణమాఫీ విషయంలో ఉద్యానవన రైతుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చూపుతున్న వివక్ష తగదు. పంటలు సాగు చేసే వారందరు రైతులే. మరి అలాంటప్పుడు రుణమాఫీ ఉద్యానవన రైతులకు వర్తించదని బ్యాంకర్లు చెపుతుండటం బాధాకరం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు అనేక ఆంక్షలు పెట్టడం సరికాదు. దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి చేసిన రుణమాఫీని రైతులు హర్షించారు. చంద్రబాబునాయుడు చేస్తున్న రుణమాఫీపై విమర్శలకు దారితీస్తోంది. రుణమాఫీ రైతులందరికీ వర్తించాలి.
- ఆకేపాటి అమర్‌నాధరెడ్డి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
రుణమాఫీ హుళక్కి!
Published Sun, Sep 7 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement
Advertisement