విషం తాగిన దంపతులు
భార్య మృతి,భర్త పరిస్థితి విషమం
గంటావూరులో విషాదఛాయలు
పలమనేరు: పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరులో బుధవారం ఉదయం ఓ కుటుంబాన్ని అప్పులు మింగేశాయి. అప్పులు తాళలేక దంపతులు విషం తాగారు. భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. గంటావూరుకు చెందిన క్రిష్ణమూ ర్తి జాతీయ రహదారికి ఆనుకుని హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యాపారం నిమిత్తం ఆయన పలువురి వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చడం కష్టతరంగా మారింది. కొన్నాళ్లుగా ఆయన కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా లాభం లేకపోయింది. కన్న కొడుకు పరిస్థితి ఇలా అయిపోయిందని మానసికంగా కుంగిపోయిన తల్లి ఇటీవల చనిపోయింది. అతని కోసం రెండ్రోజులు ఎదురుచూసి తల్లి శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. అతని ప్రాణస్నేహితుడు అనారోగ్యంతో వారం క్రితం మృతిచెందాడు. తల్లి, ప్రాణస్నేహితుడు మృతిచెందిన విష యం కర్ణాటకలోని హసన్ ప్రాంతంలో ఉంటున్న క్రిష్ణమూర్తికి తెలిసింది. వారం క్రితం స్వగ్రామానికి చేరుకున్నా డు.
మనిషి తిరిగి వచ్చినందుకు కుటుం బ సభ్యులు ఆనందించారు. అయితే అప్పులెలా తీర్చాలనే ఆలోచన అతన్ని వేధించసాగింది. మంగళవారం అర్ధరాత్రి క్రిష్ణమూర్తి, అతని భార్య కోమల విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. పోలీసు లు వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా కోమల మృతిచెందింది. క్రిష్ణమూర్తి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి పిల్లలు లేరు. ఉన్న ఇల్లు తప్పా ఆస్తిపాస్తులేమీ లేవని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొంపముంచిన అప్పులు!
Published Thu, Dec 4 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement
Advertisement