రైళ్ల పునఃప్రారంభంపై 12 తర్వాతే నిర్ణయం  | Decision on the resumption of trains after April 12 | Sakshi
Sakshi News home page

రైళ్ల పునఃప్రారంభంపై 12 తర్వాతే నిర్ణయం 

Published Sat, Apr 4 2020 4:25 AM | Last Updated on Sat, Apr 4 2020 7:02 AM

Decision on the resumption of trains after April 12 - Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రద్దయిన ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పునఃప్రారంభంపై ఏప్రిల్‌ 12 తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని రైల్వేశాఖ పేర్కొంది. రైల్వే టికెట్ల బుకింగ్‌ ప్రక్రియ ఎప్పుడూ నిలిచిపోలేదని, 120 రోజుల ముందు నుంచే రైల్వే రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. 

► లాక్‌డౌన్‌ తర్వాత ప్రయాణికులకు బుకింగ్స్‌ మొదలయ్యాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ ప్రకటన జారీచేసింది.  
► లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 14 వరకు మాత్రమే ప్రయాణాల బుకింగ్స్‌ను నిలిపివేసినట్లు తెలిపింది. 
► ఏప్రిల్‌ 14 వరకు రైళ్లను నిలిపివేస్తూ రైల్వే శాఖ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ గడువులోనే ఆన్‌లైన్, కౌంటర్లలో రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం నిలిపివేసింది. గూడ్స్, సరుకు రవాణా రైళ్లు తప్ప మిగిలినవన్నీ రద్దు చేసింది.  
► సాధారణంగా వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని 120 రోజుల ముందుగానే రిజర్వేషన్‌ చేయించుకునే సౌకర్యం ఉన్నందున అధిక సంఖ్యలో ప్రయాణికులు అడ్వాన్స్‌ రిజర్వేషన్లు చేయించుకున్నారు.  
► డిమాండ్‌ ఉన్న రైళ్లలో మార్చి మొదటి వారానికే చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది.  
► ఏప్రిల్‌ నెలలోనే దూర ప్రాంత రైళ్లలో రిజర్వేషన్లకు ‘నో రూమ్‌’ దర్శనమిస్తోంది. 
► లాక్‌డౌన్‌పై స్పష్టత ఉంటే ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement