క్షీణిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్యం | Declining MLA Chevireddy Health | Sakshi
Sakshi News home page

క్షీణిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్యం

Published Wed, Jun 28 2017 11:29 PM | Last Updated on Mon, Oct 29 2018 8:34 PM

క్షీణిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్యం - Sakshi

క్షీణిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోగ్యం

♦  పడిపోతున్న బీపీ, షుగర్‌
♦  ఫోన్‌లో పరామర్శించిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌
 
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది మంది ప్రజల ఆరోగ్యలకు ముప్పుగా మారిన డంపింగ్‌ యార్డును తరలించాలని దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరింది. మూడు రోజులుగా చిత్తూరు సబ్‌జైలులో దీక్ష చేసిన ఆయన అక్కడ నుంచి బెయిల్‌పై విడుదల అయ్యాక తిరుపతి రూరల్‌ మండలం కేసీపేటలో దీక్షను కొనసాగిస్తున్నారు.
 
నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్రమేణ క్షిణిస్తుంది. బుధవారం రాత్రి దీక్ష శిబిరంలో ప్రభుత్వ వైద్యులు కాజల్‌ ఆనంద్‌ ఎమ్మెల్యేకు పరీక్షలు నిర్వహించారు. బీపీ 106/67కు, షుగర్‌ లెవల్‌ 79కి పడిపోయినట్లు గుర్తించారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షిణించే ప్రమాదం ఉందని, కోమాలోకి పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు ఆయన వ్యక్తిగత వైద్యులు హరినాథ్‌రెడ్డి, కృష్ణప్రశాంతి వైద్య పరీక్షలు చేశారు. చెవిరెడ్డిని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డును తరలిస్తామని వ్రాత పూర్వక హామీ ఇచ్చే వరకు దీక్షను కొనసాగిస్తానని ఎమ్మెల్యే చెవిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement