తిరుపతి: ప్రతి కుటుంబానికి మేలు చేయాలనే తలంపుతో చరిత్ర సృష్టించేలా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ప్రజానాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా... చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెంట నడుస్తామని టీడీపీ జిల్లా కార్యదర్శి ముడిపల్లి సురేష్‌రెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రముఖ యువ పారిశ్రామికవేత్త చేగు ప్రశాంత్‌గుప్త తెలిపారు. తిరుపతి ఎంఆర్‌పల్లెలోని సురేష్‌రెడ్డి నివాసంలో టీడీపీ నాయకులు బీరకాయల.శంకర్‌యాదవ్, దొర్నకంబాల మాజీ సర్పంచ్ మదన్‌మోహన్‌రెడ్డి, తెలుగు యువత చంద్రగిరి పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్, పాకాల.చరణ్, శానంబట్ల మాజీ సర్పంచ్ రాణి, పాపిరెడ్డిగారి మనోజ్‌కుమార్‌రెడ్డితో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ నిత్యం ప్రజల కోసం తపించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి ప్రజాసంక్షేమ ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని నమ్ముతున్నట్లు తెలిపారు. ప్రజలకు మేలు చేయాలన్న తలంపు కన్నా నాకేంటి అనే స్వార్థం ప్రస్తుతం టీడీపీలో పెరిగిపోయిందని విమర్శించారు. ఓట్ల కోసం అబద్దాలు మీద అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెంట నడుస్తామని, అందుకోసం త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరుతామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment