సాక్షి, విశాఖపట్నం : వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తా ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ‘రుతు పవనాలు కూడా మరింత బలంగా ముందుకు కదులుతున్నాయి. ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండి, అలలు సాధారణం కంటే 3.5 మీటర్లు ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని’ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. కాగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment