తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఏపీ హక్కులను కాలరాస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఏపీ హక్కులను కాలరాస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ లను కలిసి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో జరిగిన నవ నిర్మాణ చర్చాగోష్టిలో ఆయన మాట్లాడుతూ... విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థలపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కు లేదా అని డీప్యూటీ సీఎం కేఈ కేసీఆర్ ను ప్రశ్నించారు.
ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా అక్రమించుకొని దానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరును పెట్టిందన్నారు. దీంతో ఏపీలో వ్యవసాయ రంగ పరిశోధనలు చేసేందుకు వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ర్టంలో శరవేగంగా జరుగుతున్న అభివద్ధి పనులకు తోడ్పాటు వస్తుందని, ఐదేళ్లలో జరగాల్సిన అభివద్ధి రెండేళ్లలోనే సాధించేందుకు వీలవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ, నిధులను కేటాయించాలని డిమాండ్ కేఈ డిమాండ్ చేశారు.