జూన్ 15న డీఈఈ సెట్ | Diploma in Elementary Education Entrance Test on June 15 | Sakshi
Sakshi News home page

జూన్ 15న డీఈఈ సెట్

Published Wed, Apr 30 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

Diploma in Elementary Education Entrance Test on June 15

* మే 17వరకు ఫీజు చెల్లింపు.. నోటిఫికేషన్ జారీ

సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో (డీ ఎడ్) ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈసెట్-2014కు పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 15వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది.

అభ్యర్థులు మే 5 నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, మే 6 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (http://dietcet.cgg.gov.in) దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని డైట్‌సెట్ చైర్మన్, కన్వీనర్ ఎం.జగదీశ్వర్, సురేందర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను మే 5 నుంచి తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. పాత సిలబస్ ప్రకారమే ఈసారి డీఈఈ సెట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement