అయితే ఆ మేరకు జీవోను సవరించలేదు. ఈ ఏడాది స్కూళ్లు ప్రారంభమయ్యాక అన్ని మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమ తరగతులు ప్రారంభించారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురైయ్యారు. మున్సిపల్ ఉన్నతాధికారులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిలదీస్తే ఈనెల 18 నుంచి తెలుగు మాధ్యమ పుస్తకాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు ఆ పుస్తకాల జాడేలేదు. గత ఏడాది వరకు తెలుగు మాధ్యమంలో విద్యనభ్యసించిన విద్యార్థులకు పైతరగతిలో ఆంగ్లమాధ్యమం అర్థంకాక ఇబ్బంది పడుతున్నారు.
తెలుగు మాధ్యమానికి మంగళం!
Published Tue, Jun 27 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM
- మున్సిపల్ స్కూళ్లలో తెలుగు పుస్తకాల పంపిణీ నిలిపివేత
- 1 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమమే
- డ్రాపవుట్లను పెంచి స్కూళ్లు మూతకు సర్కారు వ్యూహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమానికి ప్రభుత్వం మంగళం పాడుతోంది. జూన్ 12 నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. రాష్ట్రంలోని ఏ మున్సిపల్ స్కూల్లో కూడా తెలుగు మాధ్యమ తరగతులు ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు తెలుగు మాధ్యమ పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేయలేదు. రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లోని అన్ని పాఠశాలలు కలిపి 2,199 ఉన్నాయి. వీటిలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 5 లక్షల మందికి పైగా విద్యాభ్యాసం చేస్తున్నారు. పురపాలక పాఠశాలల్లో 70 శాతం మంది విద్యార్థులు తెలుగు మాధ్యమంలోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం అర్థంకాక విద్యార్థులు మధ్యలోనే చదువుమానేస్తే.. తగ్గిపోయిన సంఖ్యను చూపి రేషనలైజేషన్ పేరిట స్కూళ్లను మూసివేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే వ్యూహంతో వ్యూహంతో ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చాపకింద నీరులా..
విద్యాశాఖకు సంబంధం లేకుండా మున్సిప ల్ శాఖ రాష్ట్రంలోని అన్ని పురపాలక స్కూళ్ల లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి గతేడాది ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై ప్రజ ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. మాటమార్చి గుంటూరు కార్పొరేషన్‌లో మాత్రమే ప్రయోగాత్మకంగా చేపడతామని, అన్ని ఏర్పాట్లు చేశాక ఇతర పురపాలక స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతా మని ప్రకటించారు. ఆంగ్ల మాధ్యమానికి సమాంత రంగా తెలుగు మాధ్యమం కూడా నిర్వహిస్తామని సర్క్యులర్ జారీచేశారు.

Advertisement
Advertisement