ఏలూరు, న్యూస్‌లైన్ :
ఇసుక తవ్వకాలపై పెత్తనాన్ని జిల్లా స్థాయి కమిటీకీ అప్పగించారు. రీచ్‌ల అప్పగింత నుం చి ఇసుక విక్రయ ధరను నిర్ణయించే అధికారం కమిటీకే ఉంటుంది. నిబంధలనలకు విరుద్ధంగా తవ్వినా, తరలించినా అపరాధ రుసుం వసూలు చేసే అధికారం కూడా కట్టబెట్టారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం మా ర్గదర్శకాలను జారీ చే సింది. ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలను సవరిస్తూ నిబంధనలను కఠినం చేసింది. మైనింగ్‌శాఖ నుంచి రీచ్‌ల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)కు అప్పగించారు. ఏరులు, వాగులలో లభించే ఇసుకను పేదలు సొంతింటి అవసరాలకు ఉచితంగా వాడుకునే అవకాశమూ కల్పించింది.
జేసీ పర్యవేక్షణలోని కమిటీదే బాధ్యత
నదులు, పెద్ద వాగులు నుంచి ఇసుక తవ్వకాలకు లాటరీ విధానంలో లీజులు కేటాయించటానికి జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాకి కమిటికీ అధికారం అప్పగించారు. ఏ అనుమతి ఇవ్వాలన్న జిల్లా స్ధాయి కమిటీదే తుది నిర్ణయం. గతంలో రీచ్‌లకు వేలం నిర్వహించేందుకు మాత్రమే పరిమితమైన జేసీకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీ కన్వీనర్‌గా డ్వామా పీడీ వ్యవహరిస్తారు. జిల్లా పంచాయతీ అధికారి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ, ఇరిగేషన్ ఈఈ, మైన్స్ ఏడీ, భూగర్భజలశాఖ డీడీలు సభ్యులుగా ఉంటారు. ప్రతీరీచ్‌ను స్వయంగా పరిశీలించి పర్యావరణ అనుమతి ఉన్న వాటికి లాటరీ తీసి ఏడాది కాలానికి రీచ్‌లను దఖలు పరుస్తారు. జిల్లాల్లో లీజులు ఇచ్చిన ప్రాంతాల్లో ఇసుక విక్రయ ధరను జిల్లా కమిటీ క్యూబిక్ మీటరుకు ఇంతని నిర్ణయిస్తుంది. లీజుదారులు ఆ మొత్తం కంటే అధికంగా వసూలు చేయకూడదు. ఇసుక ర్యాంపుల లీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని జిల్లా, మండల పరిషత్, పంచాయతీలకు 25 : 50 : 25 నిష్పత్తిలో పంచుతారు.
ఇసుకపై పెత్తనం ఇక జిల్లా కమిటీకే
Published Sat, Dec 21 2013 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement