ఏలూరు (టూటౌన్) : జిల్లాలో ఇసుక విక్రయూలను మహిళా సంఘాల ద్వారా చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ర్యాంపులలో ఇసుకను అధికారికంగా సోమవారం నుంచి విక్రయించనున్నారు. జిల్లాలో తమ్మిలేరు, కొవ్వాడ, కొంగూరుగూడెం, ఎర్రకాల్వ, నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్లతో పాటు జిల్లాలోని పోలవరం, గూటాల, తాడిపూడి, ప్రక్కిలంక, చిడిపి, కొవ్వూరు, ఔరంగాబాద్, వాడపల్లి, విజ్జేశ్వరం, పందలపర్రు, పెండ్యాల, కానూరు, తీపర్రు, సిద్ధాంతం, కరుగోరుమిల్లి, దొడ్డిపట్ల, యలమంచిలిలంక, చిట్టినాడ, ఏనుగువానిలంక ర్యాంపులను గుర్తించారు. జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, జేసీ వైస్ చైర్మన్లుగా 16 మంది కమిటీ ఇసుక సేకరణ, స్టోరేజి, రవాణా తదితర విషయూలను పర్యవేక్షించనుంది.
ఇసుక రవాణాలో అక్రమాలకు తావులేకుండా వాహనానికి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్) అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా అధికారులు ముందుగా సూచించిన మార్గంలోనే ఇసుక వాహనం వెళ్లాల్సి ఉంటుంది. డ్రైవర్ వాహనాన్ని దారిమళ్లించినా, ప్రమాదానికి గురైనా, ఎవరైనా దాడులు చేసినా అధికారులకు ఎస్‌ఎంఎస్‌లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆయా మండలాల్లోని ఎస్సై, తహసిల్దార్లకు ఈ సమాచారం అందుతుంది. వారు స్పందించకపోతే ఆర్డీవో స్థాయి అధికారులకు, వారూ స్పందించని పక్షంలో జిల్లా స్థారుు అధికారులకు, వారు కూడా సకాలంలో స్పందించకపోతే సీఎంవో కార్యాలయానికి ఎస్‌ఎంఎస్ వెళుతుంది.
ఇసుక సేకరించే రిజర్వాయర్లు, ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయనున్నారు. స్టాక్ పాయింట్ చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు. ఇసుక తరలించే వాహనాలన్నింటికి ‘ఎ’ మార్కు వేయనున్నారు. ఈ మార్కు ఉన్న వాహనాలు తప్ప మరే వాహనంలోను ఇసుక రవాణాను అనుమతించరు. వేరే వాహనాల్లో రవా ణా చేస్తే వాటిని సీజ్ చేస్తారు. ఇసుక యూనిట్ ధరను ఇప్పటకీ అధికారులు నిర్ణరుుంచలేదు. ఇసుక కొనుగోలుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయటం, ఇ- సేవా కేంద్రాల్లో కూడా సొమ్ము చెల్లించే వెసులుబాటు విని యోగదారులకు కల్పించనున్నారు. ఇసుక రవాణా చేసే వాహనాల డ్రైవర్లకు అధికారులు సెల్‌ఫోన్ సౌకర్యం కల్పిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక ఇబ్బందులు కొద్ది రోజుల్లో తీరే అవకాశం ఉంది.
రేపటి నుంచి ఇసుక విక్రయూలు ప్రారంభం
Published Sun, Sep 28 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement