జిల్లాలవారీగా బాబు ప్రకటించినవి.. | District launches declared | Sakshi
Sakshi News home page

జిల్లాలవారీగా బాబు ప్రకటించినవి..

Published Sat, Sep 6 2014 12:03 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

జిల్లాలవారీగా బాబు ప్రకటించినవి.. - Sakshi

జిల్లాలవారీగా బాబు ప్రకటించినవి..

జిల్లాకో ఎయిర్‌పోర్టు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాయలసీమలో రోడ్లకు ప్రాధాన్యం ఇచ్చారు.  కర్నూలు - శ్రీశైలం - వినుకొండ మధ్య,  కర్నూలు - నంద్యాల - గిద్దలూరు - గుంటూరు మధ్య, నంద్యాల - పోరుమామిళ్ల - కృష్ణపట్నం మధ్య, రేణిగుంట - రాజంపేట - కడప మధ్య నాలుగు లేన్ల రోడ్లు నిర్మిస్తామన్నారు.
 
శ్రీకాకుళం
 
స్మార్ట్ సిటీగా శ్రీకాకుళం. జిల్లాలో నూతన పారిశ్రామిక నగరం. భావనపాడు, కళింగపట్నం పోర్టులు. పైడిభీమవరం పారిశ్రామికవాడ. ఎయిర్‌పోర్టు. ఫుడ్‌పార్కు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్. వంశధార, నాగావళి ప్రాజెక్టులు పూర్తి. తేలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం. బౌద్ధ కట్టడాలు, శ్రీకూర్మం, అరసవెల్లి, బారువ బీచ్ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి
 
విజయనగరం
 
విజయనగరం స్మార్ట్ సిటీ. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు. పారిశ్రామిక నగరం. తోటపల్లి రిజర్వాయర్ ఏడాదిలో పూర్తి. ఫుడ్‌పార్కు. గిరిజన వర్సిటీ. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు. సంగీత, లలితకళల అకాడెమీ. మెడికల్ కళాశాల.
 
విశాఖపట్నం

విశాఖ మెగా సిటీ. అంతర్జాతీయ విమానాశ్రయం. వీసీఐసీ పారిశ్రామికవాడ. మెట్రో రైల్. ఐఐఎం, ఐఐఎఫ్‌టీ. మెగా ఐటీహబ్. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం. ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్ హబ్. ఫుడ్‌పార్కు. ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్. గంగవరం ఎల్.ఎన్.జి. టెర్మినల్. రైల్వే జోన్.
 
తూర్పు గోదావరి
 
స్మార్ట్ సిటీలుగా కాకినాడ, రాజమండ్రి. పెట్రోలియం వర్సిటీ. పెట్రోలియం కారిడార్. కాకినాడ         ఎల్‌ఎన్‌జీ టెర్మినల్. తునిలో నౌకా నిర్మాణ కేంద్రం. పోర్టు, ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పార్కు, వీసీఐసీ కారిడార్‌లో కాకినాడ. తెలుగు విశ్వవిద్యాలయం. కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ. ఫుడ్‌పార్కు. భూ, ఉపరితల జల మార్గాలు. అక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్.
 
పశ్చిమగోదావరి
 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్. నర్సాపూర్ పోర్టు. తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టు. సిరామిక్, ఆయిల్‌పామ్ పరిశ్రమలు. కొల్లేరు సరస్సు పర్యాటక ప్రాంతం. జలమార్గాల అభివృద్ధి. చింతలపూడిలో బొగ్గు వెలికితీత. పోలవరం ప్రాజెక్టు. కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు. మెట్టప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్. అక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్. ఉద్యానవన పరిశోధన కేంద్రం.
 
కృష్ణా
 
ప్రస్తుత (గన్నవరం) విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం. మచిలీపట్నం పోర్టు. ఆయిల్ రిఫైనరీ, క్రాకరీ యూనిట్. వీజీటీఎం మెట్రో రైలు. ఆటోమొబైల్, లాజిస్టిక్ హబ్. ఫుడ్ పార్కు. మెగా సిటీ, స్మార్ట్ సిటీ. ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్. బీఈఎల్ విస్తరణ. టెక్స్‌టైల్ పార్కు. భవానీ దీవులు టూరిజం సర్క్యూట్. అవనిగడ్డలో మిస్సైల్ పార్కు. ఐటీ హబ్. కూచిపూడి అకాడె మీ.
 
గుంటూరు
 
వీజీటీఎం మెట్రో రైలు. వ్వయసాయ వర్సిటీ. ఎయిమ్స్. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ. టెక్స్‌టైల్ పార్కు. స్మార్ట్ సిటీ. ఫుడ్ పార్కు. నాగార్జునకొండ, అమరావతి టూరిజం సర్క్యూట్. నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టు. సాగర్ థీమ్ పార్కు. సౌర విద్యుత్కేంద్రం.
 
ప్రకాశం
 

దొనకొండ పారిశ్రామికనగరం. మైన్స్ యూనివర్సిటీ, మినరల్ సెన్సైస్. ఒంగోలు ఎయిర్‌పోర్టు. కనిగిరి లో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి జోన్. రామాయపట్నం పోర్టు. ఫుడ్ పార్కు. వెలిగొండ-1 ఏడాదిలో పూర్తి. స్మార్ట్‌సిటీ. అక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్.
 
నెల్లూరు
 
వీసీఐసీ, బీసీఐసీ పారిశ్రామికవాడలు. ఆటోమొబైల్ హబ్. ఎయిర్‌పోర్టు. దుగరాజపట్నం పోర్టు. పులికాట్ సరస్సు పర్యాటకాభివృద్ధి. స్మార్ట్ సిటీ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్. మెరైన్ ఇన్‌స్టిట్యూట్. ఎరువుల కర్మాగారం.
 
చిత్తూరు
 
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం. కుప్పం ఎయిర్‌పోర్టు. ఏర్పేడు ఎన్‌ఐఎంజెడ్. ఐఐటీ. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చి. అపోలో హెల్త్ సెంటర్. హార్టికల్చర్ జోన్. మెగా సిటీ. ఫుడ్ పార్కు. మెట్రో రైలు. శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్. ఐటీ హబ్.
 
వైఎస్సార్ జిల్లా
 
స్టీల్‌ప్లాంట్. సిమెంటు పరిశ్రమలు. ఖనిజాధార పరిశ్రమలు. పారిశ్రామిక స్మార్ ్ట సిటీ. కడప ఎయిర్‌పోర్టు. ఫుడ్‌పార్కు. ఉర్దూ వర్సిటీ. సోలార్ పవర్. విండ్ పవర్. గార్మెంట్ క్లస్టర్.
 
అనంతపురం
 
డ్రిప్, తుంపర్ల సేద్యం. ఉద్యానవన కేంద్రం. సెంట్రల్ వర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం. నూతన పారిశ్రామిక నగరం. స్మార్ట్ సిటీ. బీసీఐసీలో హిందూపూర్. టెక్స్‌టైల్ పార్కు. ఫుడ్ పార్కు. ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ క్లస్టర్. సోలార్, విండ్ పవర్. పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. పుట్టపర్తి ఆధ్యాత్మిక నగరం. పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం. కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి.
 
కర్నూలు
 
 
స్మార్ట్ సిటీగా కర్నూలు. కొత్త విమానాశ్రయం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అవుకులో పారిశ్రామికవాడ. హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కర్నూలు. టెక్స్‌టైల్ క్లస్టర్. కోయిలకుంట్లలో సిమెంటు ఉత్పత్తుల హబ్. ఐఐఐటీ. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్సు. పర్యాటకాభివృద్ధి. సోలార్, విండ్ పవర్. విత్తనోత్పత్తి కేంద్రం. రైల్వే వ్యాగన్ల మరమ్మతుల కర్మాగారం. మైనింగ్ స్కూల్. ఫుడ్ పార్కు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement