పార్టీల వైఫల్యం వల్లే విభజన | Division due to the failure of the parties | Sakshi
Sakshi News home page

పార్టీల వైఫల్యం వల్లే విభజన

Published Thu, Oct 24 2013 2:09 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

Division due to the failure of the parties

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాజకీయ పార్టీల వైఫల్యం వల్లే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిందని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్‌బాబు అన్నారు. ప్రజల ఇబ్బందు ల దృష్ట్యా సమ్మెను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపా రు. 66 రోజుల పాటు ఉద్యోగులు చేసిన సమ్మె ఫలితంగానే విభజన ప్రక్రియ జాప్యంలో జరిగిందన్నారు. బుధవారం ఆయన  జిల్లా కేంద్రంలోని ఎన్‌జీఓ హోమ్‌లో జేఏసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.కొంతమంది రాజ కీయ పార్టీల నాయకులు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, తాము నోరు విప్పితే వారు రోడ్లపైకి రావాల్సి వ స్తోందని హెచ్చరించారు.
 
 ఉద్యమంలో పాల్గొన్న నాయకులకే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని చెప్పారు. విభజన వల్ల సామాన్య ప్రజలే అధికంగా నష్టపోతారన్నా రు. ఉద్యోగులపై దాడులు చేస్తే తీవ్ర పరిణామా లు ఉంటాయని హెచ్చరించారు. సీమాంధ్ర ఎం పీలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నారని మం డిపడ్డారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన విభజన ప్రకటన 2014లోపు అమ లు కాదని ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణంలో జరిగిన సంఘటనలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పట్టణంలో అక్రమ కేసులకు సంబంధించి కార్యవర్గంలో చర్చించి, తరువాత నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోరుున ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యే క నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మేరకు జిల్లాల వారీ గా మృతి చెందిన ఉద్యోగుల జాబితాను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. 
 
 ప్రోటోకాల్ బహిష్కరిస్తాం 
 ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎంపీలు, కేంద్రమంత్రులు వ్యాఖ్యలు చేస్తే వారి ప్రోటోకాల్‌ను బహిష్కరి స్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మరోసారి ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే రెవెన్యూపరంగా వారికి అన్ని సేవలు నిలిపివేస్తామమన్నారు.ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్రప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఉద్యమాన్ని అణచివేసేందుకు అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. పోలీసులు తక్షణమే అక్రమ కేసులు ఎత్తివేయూలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఎన్‌జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీవీ రమణ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ గంటా వెంకటరావు, ఎన్‌జీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభూజీ, సన్యాసిరాజు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దనరావు, పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement