నంగునూరు, న్యూస్‌లైన్ : ఇటీవల రాష్ర్టమంతటా వర్షాలు కురిసి భారీ నష్టం సంభవిస్తే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం కోనసీమలో మాత్రమే పర్యటించి అక్కడి రైతులకు హామీ ఇచ్చారని, ఆయనకు తెలంగాణలో జరిగిన నష్టం కనబడటంలేదా అని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పాలమాకులలో చేపడుతున్న రిలేనిరాహార దీక్షలు సోమవారం నాటికి 1013వ రోజుకు చేరుకున్నాయి. ఈదీక్షలకు హరీష్‌రావు సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు. కోనసీమలో కొబ్బరి చెట్లు విరిగితే పరిహారం ఎక్కువగానే ఇప్పిస్తానని చెప్పిన సీఎం తన ప్రాంతీయాభిమానాన్ని చాటుకున్నారు.
తెలంగాణ ప్రాంతంలో మొక్కజొన్న, వరి, పత్తి పంట నష్టపోతే రాష్టంలోని మూడు ప్రధాన పార్టీల నాయకులు ఆంధ్రలోనే పర్యటించారే తప్ప తెలంగాణలోని ఒక్క రైతునైనా ఓదార్చారా అని ప్రశ్నించారు. తెలంగాణలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతును ఆదుకోవాలని అసెంబ్లీలో సాక్షిగా అడిగితే ఒక్క పైసా కూడా ఇవ్వనని చెప్పిన సీఎం ఈ ప్రాంతానికి ఎలా న్యాయం చేస్తారన్నారు. ఇక్కడి రైతుల సమస్యలు సీఎంకు చెప్పడం దండుగని అందుకే ఆయనను కలవకుండా మంత్రి శ్రీధర్‌బాబును కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరామన్నారు. దీక్షల్లో వెంకటాపూర్ గ్రామ జీవనజ్యోతి గ్రూపు సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ ఎల్లంకి గీత తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మల్లయ్య, రవీందర్‌రెడ్డి, పురేందర్, రమేశ్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణలో పంటనష్టం కనిపించడంలేదా!
Published Tue, Oct 29 2013 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement
Advertisement