హైదరాబాద్ : సీమాంధ్ర ప్రజలను ఆప్రాంత నేతలు రెచ్చగొట్టడం సరికాదని మంత్రి డీకె అరుణ అన్నారు. అప్పట్లో తెలంగాణకు అనుకూలమని చెప్పిన రాజకీయ పార్టీలు విభజన ప్రకటన వెలువడిన అనంతరం మాట మార్చాయని ఆమె వ్యాఖ్యానించారు. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని...ఇప్పుడు వెనక్కి తగ్గటం సరికాదన్నారు. తెలుగు జాతికి అపఖ్యాతి తెచ్చేలా నేతలు ప్రవర్తించవద్దని పొన్నాల విజ్ఞప్తి చేశారు. విభజన జరిగితే నీటి యుద్ధాలు వస్తాయని....రాజకీయ కోణంలో నేతలు చెబుతున్నారని ఆయన అన్నారు.