గండేపల్లి, న్యూస్‌లైన్ : మాజీ మంత్రి తోట నరసింహం ముఖ్య అనుచరుడు, గండేపల్లి మండలం మురారికి చెందిన కాంగ్రెస్ బ్లాక్ వన్ అధ్యక్షుడు చలగళ్ల దొరబాబు. తన 400 మంది అనుచరులతో బుధవారం ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, కాకినాడ పార్లమెంటరీ నాయకుడు చలమలశెట్టి సునీల్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ నేతలు కండువాలు వేసి ఆహ్వానించారు.
రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్న చంద్రబాబు రాష్ర్ట విభజనను అడ్డుకోలేకపోయారని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు విమర్శించారు. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించగల సత్తా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే ఉందని చలమలశెట్టి సునీల్ అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించారన్నారు.
జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని తన తండ్రి జ్యోతుల నెహ్రూ కు ఇవ్వాలని నవీన్ కోరారు. పీఏసీఎస్ అధ్యక్షుడు ముమ్మన సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ గద్దె చినసత్తిరాజు, భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు గారపాటి శేషగిరిరావు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పరిమి బాబు, మేకా మాధవరావు, సుంకవిల్లి రాజారావు, అడబాల భాస్కరరావు, ఉప్పలపాటి సాయి, మద్దిపట్ల రామకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలోకి దొరబాబు
Published Thu, Mar 20 2014 1:53 AM | Last Updated on Tue, May 29 2018 5:24 PM
Advertisement
Advertisement