సికింద్రాబాద్-తిరుపతిల మధ్య మార్చిలో డబుల్ డెక్కర్: కోట్ల | double dukker train frommarch tirupathi-secunderabad : kotla | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్-తిరుపతిల మధ్య మార్చిలో డబుల్ డెక్కర్: కోట్ల

Published Mon, Feb 10 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

double dukker train frommarch tirupathi-secunderabad : kotla

 గద్వాల, న్యూస్‌లైన్: సికింద్రాబాద్-తిరుపతి మధ్య పగటిపూట ప్రయాణించే డబుల్ డెక్కర్  రైలు మార్చిలో పట్టాలపైకి రానుందని రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇది తొలి ప్రయత్నమన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో విలేకరులతో మాట్లాడుతూ గద్వాల-రాయచూర్‌ల మీదుగా ద్రోణాచలం(డోన్)-ముంబై  ఎక్స్‌ప్రెస్‌నూ మార్చిలోనే ప్రారంభిస్తామన్నారు. కర్నూలు వద్ద కోచ్ మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు రూ. 2,050 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ త్వరలోనే పట్టాలెక్కనుందని,  రైల్వే భద్రతా విభాగంలో మహిళలకు 10 శాతం ఉద్యోగాలిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement