secunderabad-tirupathi
-
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైలు ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ రైలులో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బోగీలను రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ రైలుకు ఉన్న డిమాండ్‌ను వివరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కసరత్తు ప్రారంభించిన రైల్వే బోర్డు తాజాగా వందేభారత్ రైలులో కోచ్‌లను రెట్టింపు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. యాత్రికులు&ప్రయాణికుల నుండి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్ - తిరుపతి మధ్యన తిరుగుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రస్తుతం ఉన్న 8 కోచ్ ల నుండి 16 కోచ్ లకు పెంచటానికి అంగీకరించిన PM శ్రీ @narendramodi గారికి, రైల్వేశాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి కృతజ్ఞతలు. pic.twitter.com/FhKD07K5MX — G Kishan Reddy (@kishanreddybjp) May 9, 2023 ఇది కూడా చదవండి: మహిళా ప్రయాణికులకు రూ.80 కే టీ–24 టికెట్ -
సికింద్రాబాద్-తిరుపతి ‘వందే భారత్’ రైలు ప్రత్యేకతలు, టికెట్ ధరలివే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్లో శనివారం ఉదయం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తొలి వందే భారత్ రైలు నడుస్తుండగా.. ఇది రెండోది కానుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. తాజాగా ఈ మార్గంలో టికెట్ల ధరల వివరాలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్ రూట్లలో టికెట్ల రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉంది. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు ► నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం ►వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం ►దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ. ►1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్‌లు ►ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్‌లను పెంచే అవకాశం ►శనివారం ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం ►ఈనెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో వందే భారత్ ట్రైన్ ►ఈ వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు ►సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలు ►తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు ►వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోక సికింద్రాబాద్ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా.. ఛైర్ కార్ ►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470 ►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865 ►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075 ►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270 ►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680 ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ►సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900 ►సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620 ►సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045 ►సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455, ►సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080 చదవండి: ప్రధాని పర్యటనకు కేసీఆర్ వస్తే సన్మానం చేస్తాం: బండి సంజయ్ -
సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్–తిరుపతి(02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 23, 30, మే 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 6.40కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ఈ నెల 24, మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మచిలీపట్నం–సికింద్రాబాద్ (07185/07186) స్పెషల్ ట్రైన్ ఈ నెల 24, మే 1, 8, 15, 22, 29 జూన్ 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగించనుంది. -
సికింద్రాబాద్-తిరుపతిల మధ్య మార్చిలో డబుల్ డెక్కర్: కోట్ల
గద్వాల, న్యూస్‌లైన్: సికింద్రాబాద్-తిరుపతి మధ్య పగటిపూట ప్రయాణించే డబుల్ డెక్కర్ రైలు మార్చిలో పట్టాలపైకి రానుందని రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇది తొలి ప్రయత్నమన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో విలేకరులతో మాట్లాడుతూ గద్వాల-రాయచూర్‌ల మీదుగా ద్రోణాచలం(డోన్)-ముంబై ఎక్స్‌ప్రెస్‌నూ మార్చిలోనే ప్రారంభిస్తామన్నారు. కర్నూలు వద్ద కోచ్ మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు రూ. 2,050 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ త్వరలోనే పట్టాలెక్కనుందని, రైల్వే భద్రతా విభాగంలో మహిళలకు 10 శాతం ఉద్యోగాలిస్తామని చెప్పారు.