Union Minister Kishan Reddy Revealed That Secunderabad-Tirupati Vande Bharat Train Coaches Increase To 16 - Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

Published Tue, May 9 2023 8:40 PM | Last Updated on Tue, May 9 2023 8:59 PM

Secunderabad-Tirupati Vande Bharat Train Coaches Increase To 16 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వందేభారత్‌ రైలు ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌. సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్టు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. 

కాగా, సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ రైలులో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బోగీలను రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ రైలుకు ఉన్న డిమాండ్‌ను వివరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు  రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కసరత్తు ప్రారంభించిన రైల్వే బోర్డు తాజాగా వందేభారత్‌ రైలులో కోచ్‌లను రెట్టింపు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

ఇక, సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్టు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: మహిళా ప్రయాణికులకు రూ.80 కే టీ–24 టికెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement