జనబాంధవునికి ఘన నివాళి | Dr.YS Rajashekar Reddy 65th Jayanthi | Sakshi
Sakshi News home page

జనబాంధవునికి ఘన నివాళి

Published Wed, Jul 9 2014 2:27 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

జనబాంధవునికి ఘన నివాళి - Sakshi

జనబాంధవునికి ఘన నివాళి

అమలాపురం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. అమలాపురం బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్షాలు పడాలని పంచాంగకర్త ఉపద్రష్ట కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక విజయదుర్గ ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ పాల్గొన్నారు. అయినవిల్లిలో జరిగిన జయంతి వేడుకల్లో చిట్టబ్బాయి, మోహన్ పాల్గొన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఏలేశ్వరంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు.
 
 శివాలయంలో వరుణయాగం నిర్వహించారు. ప్రత్తిపాడులో జరిగిన వేడుకల్లో వరుపులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపేట పాతబస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి క్షీరాభిషేకం చేశారు. మాట తప్పని నేతగా ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాక ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్సార్ ఆరంభించారన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గాని గంగాధర్ పాల్గొన్నారు. ఆలమూరులో పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో పట్టణ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
 వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో ఏర్పాటు చేసిన 65 కిలోల భారీ కేక్‌ను ఆదిరెడ్డి, ఇతర నాయకులు కట్ చేశారు. లాలాచెరువు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అడ్డతీగలలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్‌ల ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రోగులకు పాలు,పండ్లు పంపిణీ చేశారు. రాజానగరం, కోరుకొండ, రాజమండ్రి రూరల్ మండలాల్లో వైఎస్సార్ జయంతి వేడుకల్లో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. మాటకు కట్టుబడిన నేతగా వైఎస్సార్ జనహృదయాల్లో నిలిపోయారని కొనియాడారు. ఆయన విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు.
 
 వైఎస్సార్ అమర్ రహే..
 జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జగ్గంపేట సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, వైఎస్సార్ అమర్హ్రే.. జగన్ నాయకత్వం వర్ధిలాల్లని నినాదాలు చేశారు. వైఎస్సార్ సేవాసమితి ఆధ్వర్యంలో వికలాంగులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో నవీన్ పాల్గొన్నారు. రాజమండి రూరల్ పరిధిలో బొమ్మూరు, కడియం, ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, విప్పర్తి వేణుగోపాలరావు వైఎస్సార్‌కు నివాళులర్పించారు. ధవళేశ్వరంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పి.గన్నవరం నియోజకవర్గంలో జరిగిన వేడుకల్లో నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర రైతు విభాగం సభ్యుడు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు.
 
 మామిడికుదురులో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పి.గన్నవరం పట్టాభిరామస్వామి ఆలయంలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. ముమ్మిడివరంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. రోగులకు పండ్లు, పాలు పంచారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో జరిగిన వేడుకల్లో నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు పాల్గొని  వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కాకినాడలో పార్టీ నగర అధ్యక్షుడు ఆర్.వి.జె.ఆర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా ప్రచార కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, చేనేత విభాగం కన్వీనర్ పంపన రామకృష్ణ పాల్గొని నివాళులర్పించారు.
 
 మహర్షి సాంబమూర్తి వికలాంగ పాఠశాల విద్యార్థులకు భోజన వితరణ చేశారు. మండపేట మండలం అత్తమూరులో జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో వృద్ధమహిళలకు చీరలు పంచారు. రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, పార్టీ నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరిల ఆధ్వర్యంలో మండపేటలో, సీఈసీ సభ్యుడు రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కపిలేశ్వరపురం మండలంలో, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురం  మున్సిపల్ కార్యాలయం, పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement