పంటలు ఎండుతున్నాయ్! | Dried crops in rabi season | Sakshi
Sakshi News home page

పంటలు ఎండుతున్నాయ్!

Published Wed, Dec 10 2014 2:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

పంటలు ఎండుతున్నాయ్! - Sakshi

పంటలు ఎండుతున్నాయ్!

కడప అగ్రికల్చర్/ రాజుపాళెం: రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ రబీ సీజన్‌లో జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 2.05 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పంటల సాగు ప్రారంభంలో పదునుపాటి వర్షాలు పడడంతో రైతులు ఎంతో ఆశతో పంటలను సాగు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,13,387 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. అక్టోబరు నెల మొదటి వారం నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది.

ఆ నెలలో 131.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 73.7 మి.మీ. కురిసింది. నవంబరులో 93.4 మి.మీ. వర్షపాతానికి గాను 22.9 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ డిసెంబరు నెలలో 25.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు చుక్క చినుకు కూడా భూమి మీద పడలేదు. నవంబరు 13వ తేదీ నుంచి ఇప్పటికి దాదాపు 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్ని పంటలు వాడుదశకు చేరుకున్నాయి.

జిల్లాలో ప్రధాన పంట అయిన బుడ్డశనగ 52022 హెక్టార్లలోనూ, ధనియాలు 17,200 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 5944 హెక్టార్లు, మినుము 5020 హెక్టార్లు, పెసర 4476 హెక్టార్లు, ఉలవ 2447 హెక్టార్లు, మొక్కజొన్న 1490 హెక్టార్లు, జొన్న 7065 హెక్టార్లలో సాగైంది. వర్షాభావంతో ఆయా పంటలన్నీ ఎండిపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు.

గతనెల చివరి వారంలో తుపాను ప్రభావంతో కొంతవరకైనా వర్షపు జల్లులు కురుస్తాయని రైతులు ఎంతగానో ఆశించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన బుడ్డశనగ, మినుము,కడప అగ్రికల్చర్/ రాజుపాళెం: రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ రబీ సీజన్‌లో జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 2.05 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

పంటల సాగు ప్రారంభంలో పదునుపాటి వర్షాలు పడడంతో రైతులు ఎంతో ఆశతో పంటలను సాగు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,13,387 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. అక్టోబరు నెల మొదటి వారం నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఆ నెలలో 131.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 73.7 మి.మీ. కురిసింది. నవంబరులో 93.4 మి.మీ. వర్షపాతానికి గాను 22.9 మిల్లీమీటర్ల వర్షం పడింది.

ఈ డిసెంబరు నెలలో 25.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు చుక్క చినుకు కూడా భూమి మీద పడలేదు. నవంబరు 13వ తేదీ నుంచి ఇప్పటికి దాదాపు 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్ని పంటలు వాడుదశకు చేరుకున్నాయి. జిల్లాలో ప్రధాన పంట అయిన బుడ్డశనగ 52022 హెక్టార్లలోనూ, ధనియాలు 17,200 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 5944 హెక్టార్లు, మినుము 5020 హెక్టార్లు, పెసర 4476 హెక్టార్లు, ఉలవ 2447 హెక్టార్లు, మొక్కజొన్న 1490 హెక్టార్లు, జొన్న 7065 హెక్టార్లలో సాగైంది. వర్షాభావంతో ఆయా పంటలన్నీ ఎండిపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు.

గతనెల చివరి వారంలో తుపాను ప్రభావంతో కొంతవరకైనా వర్షపు జల్లులు కురుస్తాయని రైతులు ఎంతగానో ఆశించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన బుడ్డశనగ, మినుము,పెసర పంటలు వర్షాభావంతో ఎండిపోతున్నాయని ఆయా ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో వారం రోజుల్లో వర్షాలు గనుక కురవకపోతే పంట దిగుబడులను మరిచిపోవాల్సిందేనని రైతులు మదన పడుతున్నారు.  కేసీ చాపాడు, కుందూనది పరిధిలోని రైతులు ఆయిల్ ఇంజన్లు, ట్రాక్టర్ల పంపుల సహాయంతో ఎకరాకు రూ.1 నుంచి 3 వేల వరకు ఖర్చు చేసి నీటితుడులు అందించుకుంటున్నారు. పర్లపాడు, అర్కటవేముల, పొట్టిపాడు, చిన్నశెట్టిపల్లె, సోమాపురం, రాజుపాళెం తదితర గ్రామాల్లోని రైతులకు ఏనీరు రాక పంటలు ఎండుముఖం పడుతున్నాయి.

నాలుగు రోజుల కిందట మైలవరం నీటిని వరిలామని అధికారులు చెబుతున్నా ఇంకా ఇంతవరకు మండలంలోని గ్రామాల  పొలాలకు రాలేదని రైతులు వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని  ఎండుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్నామన్నారు.   పెట్టుబడులన్నీ నేలపాలు కాక తప్పదని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement