మునగ గింజలతో ‘మంచి’ నీరు | Drink water can filter with Drumstick seeds | Sakshi
Sakshi News home page

మునగ గింజలతో ‘మంచి’ నీరు

Published Thu, May 14 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

మునగ గింజలతో ‘మంచి’ నీరు

మునగ గింజలతో ‘మంచి’ నీరు

సాక్షి, విజయవాడ బ్యూరో: క్లోరినేషన్ చేయకుండా, వాటర్ ఫిల్టర్ ఉపయోగించకుండా కేవలం మునగ గింజలతో నీటిని శుద్ధి చేసే విధానం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రకృతి సిద్ధంగా లభించే మునగ గింజలతో బురద నీటిని సైతం శుద్ధిచేసి తాగునీరుగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధానాన్ని విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీఎస్ రాజు ప్రయోగాత్మకంగా కనుగొన్నారు.
 
 ఇదీ విధానం..: ఎండిన గింజలను కాయ నుంచి వేరుచేసి అందులోని పప్పును మెత్తని పిండిగా చేయాలి. దాన్ని శుభ్రమైన నీటిలో కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. దానికి తగినంత నీరు కలిపి పలుచగా తయారుచేయాలి. పాల మాదిరి తెల్లగా ఉన్న ఈ మిశ్రమాన్ని అపరిశుభ్రంగా ఉన్న నీటిలో వేసి అర నిమిషంపాటు వేగంగా కలపాలి. తర్వాత ఐదు నిమిషాల వరకూ నెమ్మదిగా.. నిమిషానికి 15 లేక 20 సార్లు కలపాలి. అనంతరం నీటిపై మూతపెట్టి ఒక గంట వరకు వదిలేయాలి. తర్వాత ఆ నీటిని వడగట్టుకోవాలి. ఒకవేళ నీటిని కదిపితే ఫలితం ఆలస్యమవుతుంది. సాధారణంగా పెద్ద బకెట్‌లో పట్టే నీటిని శుభ్రపరిచేందుకు రెండు టీ స్పూన్‌ల (ఐదు మిల్లీమీటర్లు పట్టేవి) మునగ గింజల పౌడర్ అవసరం. ఈ పద్ధతితో నీటిలోని బ్యాక్టీరియా కూడా పోతుంది. దీని వల్ల నీటి పీహెచ్ ఏమాత్రం మారదు. ప్రకృతి సిద్ధంగా లభించే మునగ గింజలు కావడంతో దీనివల్ల ఎటువంటి హాని కలగదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement