వేగంగా వెళ్తున్న టిప్పర్ ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా కంచికచర్ల ఎన్‌ఎస్‌పీ కాలువ వద్ద గురువారం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో టిప్పర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసరావు(45) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్త్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.