ఎంప్లాయీస్ యూనియన్ విజయఢంకా
ఫలితాలు ఇలా..
జిల్లాలో 13 డిపోలకుగాను
ఎనిమిదింటిలో విజయం
5 డిపోలతో సరిపెట్టుకున్న ఎన్.ఎం.యు.
ప్రభావం చూపించలేకపోయిన
కార్మికపరిషత్
పట్నంబజారు(గుంటూరు) ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో గుంటూరు రీజియన్‌లో ఎంప్లాయిస్ యూనియన్ విజయశంఖారావాన్ని పూరించింది. ప్రధాన ప్రత్యర్థి నేషనల్ మజ్దూర్ యూనియన్‌పై ఘన విజయాన్ని సాధించింది. రీజియన్‌లోని 13 డిపోల్లో ఎనిమిది డిపోలు ఎంప్లాయిస్ యూనియన్ కైవసం చేసుకోగా, ఎన్‌ఎంయూ ఐదు డిపోలతో సరిపెట్టుకుంది. బాపట్ల, రేపల్లె, నరసరావుపేట, వినుకొండ, గుంటూరుడిపో-2, మంగళగిరి,మాచర్ల, పిడుగురాళ్ళ డిపోల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించగా, పొన్నూరు, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు డిపో-1, చిలకలూరిపేటల్లో ఎన్‌ఎంయూ విజయం సాధించింది. ఎంప్లాయిస్ యూనియన్ బాపట్ల డిపోలో 62 ఓట్ల మెజార్టీ, రేపల్లె -80, నరసరావుపేట - జిల్లాకు 56, స్టేట్‌కు 61, వినుకొండ -15, సత్తెనపల్లి స్టేట్‌కు-29, గుంటూరు డిపో-2లో జిల్లాకు 61, స్టేట్‌కు-57, మంగళగిరి జిల్లా-79, స్టేట్‌కు-64, మాచర్ల జిల్లా- 37, స్టేట్‌కు-55, పిడుగురాళ్ల జిల్లా 54, స్టేట్-54 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ పొన్నూరు డిపోలో 110 ఓట్లతో, తెనాలి డిపోలో 34, సత్తెనపల్లి డిపోలో 11 ఓట్లతో, చిలకలూరిపేట డిపోలో 5 ఓట్లతో, గుంటూరు డిపో-1లో 106 ఓట్లతో విజయం సాధించింది. మొత్తం కలిపి జిల్లా వ్యాప్తంగా ఎంప్లాయిస్ యూనియన్‌కు స్టేట్‌కు 2,584 ఓట్లు రాగా, జిల్లాకు 2,585 ఓట్లు వచ్చాయి.
నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు స్టేట్‌కు 2270 రాగా, జిల్లాకు 2230 వచ్చాయి. వీటితోపాటు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియర్‌కు స్టేట్‌కు 38, జిల్లాకు 38, కార్మిక పరిషత్‌కు స్టేట్‌కు 318, జిల్లాకు 352 ఓట్లు రాగా, ఎస్‌డబ్ల్యూఎఫ్ స్టేట్‌కు 238, జిల్లాకు 252 ఓట్లు సాధించాయి. బీడబ్ల్యూ, కార్మిక సంఘ్, యునెటైడ్ వర్కర్స్ యూనియన్ సంఘాలకు కేవలం కొద్దిపాటి ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రీజియన్ పరిధిలో ఎంప్లాయిస్ యూనియన్‌కు అధిక ఓట్లు, డిపోలు రావడంతో మెజార్టీ సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
పోలింగ్ కేంద్రాల తనిఖీ..
ఆర్టీసీ బస్టాండ్‌లోని డిపో-1, డిపో-2ను కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎల్లారావు, ఏపీఎస్‌ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తనిఖీ చేశారు. ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించారు.