కుటుంబంలో మగవారు లేకపోవడంతో ఓ కోడలు మామకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేసింది. ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూర్ గ్రామంలో చోటుచేసుకుంది
వెల్దుర్తి, న్యూస్‌లైన్: కుటుంబంలో మగవారు లేకపోవడంతో ఓ కోడలు మామకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేసింది. ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రావుల సాయిలు(50) గుండెపోటుతో గురువారం రాత్రి మృతిచెందాడు.
సాయిలు భార్య లక్షి నాలుగేళ్ల క్రితం మృతిచెందగా, ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు రెండేళ్ల క్రితం, మరో కుమారుడు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇద్దరు కోడళ్లు మాత్రమే ఉండగా, శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో పెద్ద కోడలు మణెమ్మ తలకొరివి పెట్టింది.