సీమాంధ్ర ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు వరుసగా రెండోరోజు కూడా ఆటంకాలు ఎదురయ్యాయి. పశ్చిమగోదావరి, చిత్తూరు లాంటి జిల్లాల్లో మాత్రం పటిష్ఠమైన పోలీసు బందోబస్తు మధ్య సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఉదయం నుంచి కొనసాగుతోంది. 15 వేలకు పైబడి ర్యాంకులు వచ్చినవారికి మంగళవారం నాడు సర్టిఫికెట్ల పరిశీలన జరగాల్సి ఉంది.
అయితే, పలు సెంటర్లలో సమైక్యవాదులు కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ఆశగా వచ్చిన విద్యార్థులు వెనుదిరగాల్సి వచ్చింది. విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో ఎక్కడా అస్సలు కౌన్సెలింగ్ ఊసన్నదే లేదు. విజయవాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా సిబ్బంది విధులు బహిష్కరించారు.
సీమాంధ్రలో రెండోరోజూ కౌన్సెలింగ్కు అడ్డంకులు
Published Tue, Aug 20 2013 11:25 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement