భూప్రకంపనలు నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులను వణికించాయి.
భూప్రకంపనలు నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులను వణికించాయి. స్వల్పంగా భూమి కంపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు జిల్లా కొండాపురం, కలిగిరిలో బుధవారరం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచెర్ల, బలిజిపాలెం గ్రామాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. నివాసాల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. మళ్లీ భూమి కంపిస్తుందేమోన్న భయంతో ఇళ్ల బయటే ఉన్నారు.