=పలుచోట్ల రచ్చబండకు సమైక్య సెగ
=ఏర్పేడులో చింతామోహన్‌ను అడ్డుకునే యత్నం
=తొట్టంబేడులో భద్రత నడుమ ఎంపీ సభ
=తవణంపల్లెలో ప్రొటోకాల్ వివాదం
తిరుపతి, సాక్షి: జిల్లాలో బుధవారం శ్రీకాళహస్తి నియోజవకర్గంలోని ఏర్పేడు, తొట్టంబేడులో, పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లెలో రచ్చబండ కార్యక్రమాలకు సమైక్య సెగ తగిలింది. ఏర్పేడులో ఎంపీ చింతామోహన్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచడానికి సహకరించడం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లు అడ్డుకునే యత్నం చేశారు. ఎంపీడీవో కార్యాలయు ఆవరణలో జరిగే రచ్చబండకు ఎంపీ చింతామోహన్ వచ్చారు.
ఎంపీ లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు కార్యాలయు గేటు ముందే వైఎస్సార్ సీపీ నేతలు వేచి ఉండగా, పోలీసు బలగాలు అరెస్టు చేసి, చింతమోహన్‌ను కారును లోపలికి పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతామోహన్ స మైక్య ద్రోహిగా మారారని, పోలీసులతో బలవంతం గా అరెస్టు చేరుుంచారని ఆరోపించారు. తొట్టంబేడులో సమైక్యవాదులు ఎంపీని అడ్డుకుంటారని భా వించి పోలీసులు అప్రమత్తమయ్యారు. పటిష్టమైన భద్రత మధ్య సభ నిర్వహించారు. సభలో ఎంపీ ప్రసంగాన్ని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఉన్నం వాసుదేవనాయడు అడ్డుకుని పలు ప్రశ్నలు సం ధించారు.
రచ్చబండ పేరుతో రాజకీయు ఉపన్యాసాలు, ఓట్లు దండుకునే ప్రయుత్నాలు చేస్తున్నారే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వివుర్శించారు. రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో వూజీ ఎమ్మెల్యే ఫొటోను ప్రచురించడాన్ని ఆయున ఆక్షేపించారు. పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ కండువాలు కప్పుకుని వేదికపై కూర్చోవడంపై రాజకీయు బండగా మారిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ వుండల కో-కన్వీనర్ వన్నెపుల్లారెడ్డి ప్రొటోకాల్ పాటించలేదని నిలదీశారు. తవణం పల్లె రచ్చబండ కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదమైంది.
తమ పార్టీ మద్దతుదారుడు ఎగువ తవణంపల్లె సర్పంచ్‌ను స్టేజీపైకి ఆహ్వానించకుండా అధికారులు విస్మరించారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. అర్హతలేని టీడీపీ,కాంగ్రెస్ కార్యకర్తలను స్టేజీ ఎక్కించారని నాయకులు గాంధీబాబు, తదితరులు ఆగ్రహిం చారు. అధికారులు ఎమ్మెల్యే తొత్తులుగా మారారని ఆరోపించారు. ఎమ్మెల్యే రవి డౌన్‌డౌన్, జై సమాక్యాంధ్ర అంటూ స్టేజీపైకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త రవిప్రసాద్ జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు ఆయనను బయటకు పంపించి వేశారు.
రెండో రోజూ అదే తీరు
Published Thu, Nov 14 2013 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement