Cintamohan
-
‘చింతా’ హౌసింగ్ గేమ్!
ఓట్ల కోసం రాజీవ్ ఆవాస్ యోజన మూడు నెలల్లో పదివేల ఇళ్లు నిర్మిస్తారట! ఆరేళ్లుగా మొండిగోడలకే పరిమితమైన దామినేడు హౌసింగ్ స్కీం పట్టించుకోని ఎంపీ చింతామోహన్ సాక్షి, తిరుపతి: ఓట్ల కోసం పేదలతో చింతా మోహన్ ‘హౌసింగ్ గేమ్’ మొదలు పెట్టారు. ఆ గేమ్ పేరు ‘రాజీవ్ ఆవాస్ యోజన’ (ఆర్‌ఏవై). సీమాంధ్ర ప్రాంతం సమైక్య ఉద్యమంతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. చింతామోహన్ మాత్రం ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. అయితే ప్రజల ఆకాంక్షను చింతా ఆలస్యంగా గుర్తించారు. మౌనంగా ఉంటే త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమనుకున్నారు. ఢిల్లీ స్థాయిలో పావులు కదిపి ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పేరుతో ఓట్ల రాజకీయం మొదలు పెట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తన లోక్‌సభ పరిధిలోనిది కావటంతో అందులోని వికృతమాల పంచాయతీ వద్ద ఎయిర్‌పోర్టు పక్కన పది వేల ఇళ్లు నిర్మిస్తామని, తిరుపతిలోని పేదలందరికీ అక్కడ గృహాలు కేటాయిస్తామని మహిళాగ్రూప్ల వద్ద, తన అనుచరుల ద్వారా దరఖాస్తులు సేకరించటం ప్రారంభించారు. హడావుడిగా వికృతమాల వద్ద ఆర్‌ఏవై కింద నిర్మాణాలు చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. దామినేడు ఇళ్లు కనిపించలేదా? తిరుపతిలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే చిత్తశుద్ధి చింతామోహన్‌కు లేదు. ఎందుకంటే ఆరేళ్లుగా దామినేడు వద్ద 4,087 ఇళ్లు మొండిగోడలతోనే ఉన్నాయి. తిరుపతి లోని పేదలందరికీ ఇళ్లు కట్టించేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక ల్పించారు. ఈ క్రమంలో 2008లో ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ ఫర్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐహెచ్ఎస్డీపీ)లో భాగంగా దామినేడు, పాడిపేట, తనపల్లె, అవిలాల వద్ద అపార్ట్మెంట్ల నిర్మాణం ప్రారంభించారు. ఇవి పూర్తయితే తిరుపతికి చెందిన 4087 కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతుంది. మహానేత మరణం తర్వాత ఈ నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. నేటికీ మొండిగోడలు, పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఈ వేలాది ఇళ్లన్నీ చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నిర్వహణ తిరుపతి కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నా, అక్కడి ఇళ్లలో చేరితే ఓటర్లంతా చంద్రగిరి అసెంబ్లీ, చిత్తూరు ఎంపీ పరిధిలోకి వెళతారు. దీంతో అక్కడ నిర్మాణం ఆపి, తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే శ్రీకాళహస్తి పరిసరాల్లో ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని ఆర్డీవో, తహశీల్దార్ల పైన ఎంపీ ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఐహెచ్ఎస్డీపీతో పాటు జేఎన్ఎన్యుఆర్ఎం కింద చేపట్టిన మొత్తం పదివేల ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఇళ్లను పూర్తి చేయించాల్సిన చింతామోహన్ గాలికి వదిలేశారు. తాజాగా రాజీవ్ ఆవాస్ యోజన తెరపైకి తెచ్చారు. మూడు నెలల్లో ఎలా సాధ్యం? దామినేడు చుట్టుపక్కల ఆరేళ్ల క్రితం చేపట్టిన 4087 ఇళ్లు ఇంకా పూర్తి కాలేదు. మరి మూడు నెలల్లో వికృతమాలవద్ద 10 వేల ఇళ్లను చింతామోహన్ ఎలా పూర్తి చేయగలరు? ఇంత పెద్ద ఎత్తున నిర్మించే గృహనిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వెంటనే ఎలా వస్తాయి? ఆర్‌ఏవై కింద చేపడుతున్న ఇళ్లను రానున్న మూడు నెలల్లో పూర్తి చేసి కేటాయించటం సాధ్యమా ? ఇవీ సగటు జీవి ప్రశ్నలు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనే పేదల ఆకాంక్షతో చింతామోహన్ ఆడుతున్న ‘హౌసింగ్ గేమ్’గా పలువురు అభిప్రాయపడుతున్నారు. -
‘చింత’లేని మోహన్!
*మొన్న వ్యతిరేకించి.. నిన్న సమర్థించి.. నేడు మౌన ముద్ర *రాష్ట్ర విభజనపై పెదవి విప్పని తిరుపతి ఎంపీ *రానున్న రోజుల్లో పదవి కోసమే తీరు మార్చుకున్న వైనం సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నా దీనిపై తిరుపతి ఎంపీ చింతామోహన్‌కు ఏ మాత్రం చింత ఉన్నట్టు లేదు. కాంగ్రెస్ అధినేత్రిని నమ్ముకుంటే చాలు, తనకు మేలు జరుగుతుందనుకున్నారేమో.. గురువారం తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో పలువురు సీమాంధ్ర ఎంపీలు గళం విప్పినా, చింతామోహన్ మాత్రం ఉన్నా లేనట్లుగానే వ్యవహరించారు. మొదటి నుంచీ విభజనను సమర్థిస్తూ వచ్చారని ఆయన తీరును బట్టి చెప్పవచ్చు. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగిన రోజుల్లో కూడా ఇల్లు వదిలి బయటకు రాలేదు. పైగా సమైక్యవాదులపై ఆయన కొరడా ఝుళిపించారు. సమైక్య నినాదాలతో ఆయనను అడ్డుకున్న వారిపై కేసులు బనాయించారు. ఇదంతా రానున్న కాలంలో పదవి కోసమేననేది అందరికీ అర్థమైంది. అనూహ్యంగా నాలుగు రోజుల క్రితం తిరుపతిలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ వారు సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు పలికారు. అయితే ఓటర్లను నమ్ముకోవడం కంటే సోనియమ్మనే నమ్ముకోవడం మంచిదని చింతా భావించారు. ఆయన సన్నిహితులతో మాట్లాడుతూ ‘‘సోనియమ్మతో మంచిగా ఉంటే ఎప్పుడైనా ఏదో ఒక పదవి రాబట్టుకోవచ్చు. అంతేకాని ఈ జనాన్ని నమ్ముకుంటే నాకు ఒరిగేదేమీ లేదు’’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం పార్లమెంటు రణరంగంగా మారిన విషయం తెలిసిందే. తిరుపతి నగరం నుంచి ప్రాతిథ్యం వహిస్తున్న చింతా మోహన్ ఉన్నాడో లేడోననే సందేహం వచ్చే విధంగా ఆయన వ్యవహరించారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి తిరుపతి రానున్నారు. ఎంపీ తీరుపై సమైక్యవాదులు ఏవిధంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే. -
రెండో రోజూ అదే తీరు
=పలుచోట్ల రచ్చబండకు సమైక్య సెగ =ఏర్పేడులో చింతామోహన్‌ను అడ్డుకునే యత్నం =తొట్టంబేడులో భద్రత నడుమ ఎంపీ సభ =తవణంపల్లెలో ప్రొటోకాల్ వివాదం తిరుపతి, సాక్షి: జిల్లాలో బుధవారం శ్రీకాళహస్తి నియోజవకర్గంలోని ఏర్పేడు, తొట్టంబేడులో, పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లెలో రచ్చబండ కార్యక్రమాలకు సమైక్య సెగ తగిలింది. ఏర్పేడులో ఎంపీ చింతామోహన్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచడానికి సహకరించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లు అడ్డుకునే యత్నం చేశారు. ఎంపీడీవో కార్యాలయు ఆవరణలో జరిగే రచ్చబండకు ఎంపీ చింతామోహన్ వచ్చారు. ఎంపీ లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు కార్యాలయు గేటు ముందే వైఎస్సార్ సీపీ నేతలు వేచి ఉండగా, పోలీసు బలగాలు అరెస్టు చేసి, చింతమోహన్ను కారును లోపలికి పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతామోహన్ స మైక్య ద్రోహిగా మారారని, పోలీసులతో బలవంతం గా అరెస్టు చేరుుంచారని ఆరోపించారు. తొట్టంబేడులో సమైక్యవాదులు ఎంపీని అడ్డుకుంటారని భా వించి పోలీసులు అప్రమత్తమయ్యారు. పటిష్టమైన భద్రత మధ్య సభ నిర్వహించారు. సభలో ఎంపీ ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉన్నం వాసుదేవనాయడు అడ్డుకుని పలు ప్రశ్నలు సం ధించారు. రచ్చబండ పేరుతో రాజకీయు ఉపన్యాసాలు, ఓట్లు దండుకునే ప్రయుత్నాలు చేస్తున్నారే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వివుర్శించారు. రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లో వూజీ ఎమ్మెల్యే ఫొటోను ప్రచురించడాన్ని ఆయున ఆక్షేపించారు. పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ కండువాలు కప్పుకుని వేదికపై కూర్చోవడంపై రాజకీయు బండగా మారిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ వుండల కో-కన్వీనర్ వన్నెపుల్లారెడ్డి ప్రొటోకాల్ పాటించలేదని నిలదీశారు. తవణం పల్లె రచ్చబండ కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదమైంది. తమ పార్టీ మద్దతుదారుడు ఎగువ తవణంపల్లె సర్పంచ్‌ను స్టేజీపైకి ఆహ్వానించకుండా అధికారులు విస్మరించారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. అర్హతలేని టీడీపీ,కాంగ్రెస్ కార్యకర్తలను స్టేజీ ఎక్కించారని నాయకులు గాంధీబాబు, తదితరులు ఆగ్రహిం చారు. అధికారులు ఎమ్మెల్యే తొత్తులుగా మారారని ఆరోపించారు. ఎమ్మెల్యే రవి డౌన్‌డౌన్, జై సమాక్యాంధ్ర అంటూ స్టేజీపైకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త రవిప్రసాద్ జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు ఆయనను బయటకు పంపించి వేశారు.