
శివశంకర్
సాక్షి, అమరావతి : ఏపీ ఎన్నికల కమిషన్ ముందుకు మరో కొత్త వివాదం వచ్చింది. కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు బదిలీకి ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి తీసుకోకుండా శివశంకర్‌ను బదిలీ చేసింది. ఈ వ్యవహారం ఈసీ దృష్టికి రావడంతో తమ అనుమతి లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఎన్నికల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రాష్ట్రస్థాయి అధికారి బదిలీ చేయడంపై అధికార వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. ఇక ఇప్పటికే ఈవీఎంల మొరాయింపు కుట్రపై సీరియస్‌గా ఉన్న ఈసీ.. పోలింగ్ రోజు ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంపై నిశితంగా పరిశీలన చేస్తోంది. ఏపీలో పోలింగ్ జాప్యానికి చంద్రబాబు నాయుడు సూచనలే కారణమని ఈసీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ దిశగా లోతైన అధారాలు సేకరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment