హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన జెన్‌కో, ట్రాన్స్‌కోల కోసం అద్దెకు బిల్డింగ్ కావాలని ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ సౌధలోనే ఇరు రాష్ట్రాలకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) చెందిన జెన్‌కో, ట్రాన్స్‌కోలను కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న విద్యుత్ సౌధ బిల్డింగ్‌ను తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు కేటాయించనున్నారని.
..ఆంధ్రప్రదేశ్ జెన్‌కో, ట్రాన్స్‌కోల కోసం కొత్త బిల్డింగ్‌ను అద్దెకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు గవర్నరుకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్రాన్స్‌కో సీఎండీని కలిసి కూడా విన్నవించారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ సౌధలోనే ఇరు రాష్ట్రాల జెన్‌కో, ట్రాన్స్‌కో ఉంచాలని కోరారు. ఈ నేపథ్యంలో కొత్త బిల్డింగ్ అద్దె కోసం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించినట్టు తెలిసింది.
విద్యుత్ సౌధలోనే జెన్‌కో, ట్రాన్స్‌కోలు
Published Sat, Apr 12 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM
Advertisement
Advertisement