చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి ఏనుగులు దాడికి తెగబడ్డాయి. గుడిపల్లి మండలం బోయినపల్లిలో పొలంలో నిద్రిస్తున్న రైతులపై ఏనుగులు దాడి చేశాయి.
ఈ దాడిలో గణేశ్, మురుగేశ్ అనే రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం ఏనుగులు అలుగుమానిపల్లె అటవీ ప్రాంతంలోకి వెళ్లాయని స్థానికులు చెప్పుతున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖాధికారులు ఏనుగుల కోసం గాలిస్తున్నారు.