సాక్షి, నిజామాబాద్: గ్రామాలలో కూలీలకు ఉపాధి కల్పించేందు కు జిల్లా అధికారులు 2013-14లో భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకున్నారు. రూ 323.17 కోట్ల మేరకు ఖర్చు చేసి వారికి లబ్ది చేకూర్చాలని భావించారు. కానీ, ఆశించిన మేరకు ఉపాధిహామీ పనులు జరగకపోవడంతో ఇందులో సగం కూడా ఖర్చు చేయలేకపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వాస్తవ పరిస్థితుల మేరకే రూ 267.84 కోట్లతో ఉపాధిహామీ వార్షిక ప్రణాళికను ఖరారు చేస్తున్నారు.
అంటే గత ఏడాది కంటే రూ 56 కోట్ల మేరకు లక్ష్యాన్ని తగ్గించా రు. ఈ మేరకే జిల్లాలోని వివిధ గ్రామాలలో రాను న్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులను గు ర్తించి గ్రామపంచాయతీలు తీర్మానాలు చేశాయి. వీటికి మండల పరిషత్‌ల నుంచి అనుమతి తీసుకుని జిల్లా పరిషత్ ఆమోదం కోసం పంపారు. ఇందులో రూ 110 కోట్ల (లేబర్ బడ్జెట్) విలువ చేసే 38,636 ప నులకు ఇప్పటికే కలెక్టర్ ప్రద్యుమ్న పరిపాలనా అ నుమతి మంజూరు చేశారు.
మిగిలిన పనులకు కూడా త్వరలోనే కలెక్టర్ నుంచి పరిపాలన అనుమ తి తీసుకుంటామని డ్వామా (జిల్లా నీటి యాజమా న్య సంస్థ) ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ ప్రాధాన్యతలు
‘ఉపాధిహామీ’ ద్వారా రానున్న సంవత్సరంలో పొలాల వద్ద నీటి నిల్వ ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల సౌకర్యం ఉన్న రైతుల భూములలో వీటిని నిర్మించుకునేందుకు అనుమతించింది.
భూగర్భ జలాల అభివృద్ధి పనులకే ప్రాధాన్యం కల్పిస్తున్నారు. కందకాల తవ్వకం, ఊట కుంటల నిర్మాణం, చిన్న కుంటల తవ్వకం, కందకాలలో మట్టితీత పనులు చేపట్టాలని నిర్ణయించారు.
‘ఇందిరమ్మ పచ్చతోరణం’లో భాగంగా 28 లక్షల టేకు, ఎర్రచందనం మొక్కల పెంపకం, గ్రామానికి ఇద్దరు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
వచ్చే ఏడాది మూడు వేల ఎకరాలలో మామిడి, జామ, సపోట, బత్తాయి వంటి ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
భారత్ నిర్మాణ్ అభియాన్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహా యాన్ని అందజేస్తారు. ప్రతి నెల ఒక్కో గ్రామంలో 20 చొప్పున పూర్తి చేయాలని నిర్దేశించారు.