
చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా 52 వేల మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు, అలాగే ఆర్మీ సర్వీసులో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. చిత్తూరులో ప్రద్యుమ్న విలేకరులతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 2వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చామని తెలిపారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడం కుదరదని స్పష్టంగా పేర్కొన్నారు.
వివిధ శాఖల ద్వారా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్న వారికి ఆయా శాఖాధిపతుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే సౌకర్యం చేపట్టామని అన్నారు. ఓటరు లిస్టులో పొరపాట్లు, అడ్రస్ ట్యాలీ కాకపోవడం వల్ల కొందరికి పోస్టల్ బ్యాలెట్లు మంజూరు కాకపోయి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు చాలా మందికి మంజూరు కాలేదంటూ చిత్తూరు వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment