చేవెళ్ల, న్యూస్‌లైన్: పాలీహౌస్ (గ్రీన్‌హౌస్) రైతులకు సాధ్యమైనంత త్వరగా సబ్సిడీ అందిస్తామని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్యానశాఖ రంగారెడ్డి జిల్లా ఏడీ ఉమాదేవి అన్నారు. చేవెళ్ల మండలం చనువల్లిలో మంగళవారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల పా లీహౌస్ రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యానశాఖ జిల్లా ఏడీ ఉమాదేవి మాట్లాడుతూ పా లీహౌస్ ఏర్పాటు చేసుకున్న అర్హులైన ప్రతి రైతుకూ సబ్సిడీ అందజేస్తామన్నారు. పాలీహౌస్‌లను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. పాలీహౌస్‌పై అవగాహన కల్పించేం దుకు 29న చేవెళ్ల మండలంలోని సాగర్ ఫుడ్ అండ్ అగ్రిబిజినెస్ స్కూల్‌లో సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు.
జిల్లాలో 40 మందికే మంజూరు..
తెలంగాణ రీజియన్ పాలీహౌస్ రైతుల సం ఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ జి ల్లాలో సుమారు 220 మంది రైతులు పాలీ హౌస్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 40 మందికే మంజూరు ఇచ్చారని అన్నారు. కోశాధికారి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పాలీహౌస్ రైతులంతా సంఘం లో చేరి పోరాటానికి సిద్ధపడాలన్నారు.
చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డెరైక్టర్ ఆగిరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పాలీహౌస్ రైతుల సంఘం ఇన్‌చార్జి సత్యనారాయణ, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి శ్రీని వా స్, సంఘం ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చంద్రకాంత్ మాట్లాడుతూ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని వివరించారు.
సమావేశం లో చేవెళ్ల డివిజన్ ఉద్యాన అధికారి సంజయ్‌కుమార్, ఏఈఓ రాఘవేందర్, సంఘం ఉపాధ్యక్షురాలు ప్రమోద, సర్పంచ్ ఎన్ను జంగారెడ్డి, పలు జిల్లాల రైతు సంఘం ప్రతినిధులు ఎం.విజయభాస్కర్‌రెడ్డి, జి.ప్రభాకర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలీహౌస్ రైతులను ప్రోత్సహిస్తాం
Published Wed, Jan 22 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement