చేవెళ్ల: విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న సీడ్‌తో చేవెళ్లలో చైనీస్ కాలె ఆకుకూర పంటను సాగు చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన పాలీహౌస్‌లో ఈ పంటను పండిస్తున్నారు. అత్యంత పోషక విలువలున్న ఈ పంటను సుమారు 500 నుంచి 600 గజాల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. పాలీహౌస్‌లో ఆరు బెడ్లలో (వరుస) సాగుచేస్తున్నారు. మొదటగా కొన్ని రోజుల క్రితం కొన్ని మొలకలను ఆరుబయట నాటిన ఈ పంటను ప్రస్తుతం పాలీహౌస్‌లో పండిస్తున్నారు. ఈ పంట సాగు విధానం, వండే పద్ధతి, వాటిలో ఉండే పోషక విలువలు పాలీహౌస్ పర్యవేక్షకులు మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలు తెలియజేశారు.
పంట సాగు పద్ధతి ఇలా..
ఈ పంటను చైనీస్ కాలె (కైలాన్) అని పిలుసా ్తరు. దీని శాస్త్రీయ నామం ఁబ్రాసికా ఒలెరేసియో ఆల్చోగ్లాబ్ఙ్రా. ముఖ్యంగా చైనా దేశం నుంచి విత్తనాలను తీసుకువచ్చి సాగు చేస్తారు. అమెరికా తదితర దేశాలలో కూడా ఈ పంటను పండిస్తారు. సాగు విధానమేమిటంటే... చైనీస్ కాలెవిత్తనం ఆవాల వలే చిన్నగా ఉంటాయి. వీటిని నర్సరీ ట్రేలలో పోసి నారును పెంచుతారు. 20 రోజుల వ్యవధిలో విత్తనం నారుదశకు మారుతుంది. ఈ నారును టమాటా నారు నాటినట్లుగానే పొలంలో నాటుతారు. మొక్క నాటిన 40 నుంచి 60 రోజులలోపు పంట చేతికి వస్తుంది. ఆ సమయం నుంచి పంటను తీసుకోవచ్చు.
వండే విధానం..
చైనీస్ కాలె పంట ఆకుకూరవలే కాస్తుంది. ఇది దాదాపు పాలకూరను పోలి ఉంటుంది. భూమిలో నుంచి కాండం వచ్చి పైన ఆకులు కాస్తాయి. ఈ కాండాన్ని వండుకొని మునగ కాయలవలె భోజనంతో పాటు తీసుకోవచ్చు. వండే విధానం ఎలాగంటే.. ఈ పంటను కాండంతో పాటుగా మొదటికి కోస్తారు. కోసిన తర్వాత కాండాన్ని, ఆకులను వేరు చేస్తారు. కాండాన్ని నాలుగు ముక్కలుగా కోయాలి.
మొదట నీటిలో ఉప్పువేసి ఉడకబెడతారు. ఉడికేటప్పుడు డార్క్ సోయాసెస్ వేస్తే పొంగుతుంది. అప్పుడు దానిని బయటకు తీసి నీటిని పారబోసి చల్లార్చాలి. తర్వాత వంట పాత్రలో ఆలివ్ ఆయిల్‌వేసి చైనీస్ కాలె కాండం ముక్కలు వేయాలి. వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. నాలుగు స్పూన్ల చక్కరవేసి ఉడకబెట్టాలి. 7 నుంచి 8 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత పొయ్యిమీద నుంచి తీస్తే వంట పూర్తవుతుంది. కాండంనుంచి వేరుచేసిన ఆకులను కూడా వండుకోవచ్చు.
విటమిన్లు ఎన్నో...
చైనీస్ గైలాన్ అని కూడా పిలిచే ఈ వంటకంలో అనేక పోషక పదార్థాలున్నాయి. దీనిలో విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉన్నాయి. ఈ వంటకం తిన్నవారికి శరీర పైభాగాన ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయి.
మన గడ్డపై ‘చైనీస్ కాలె’
Published Sun, Sep 21 2014 11:39 PM | Last Updated on Mon, Aug 13 2018 3:35 PM
Advertisement
Advertisement